సీఎం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ పాలన.. : బీఆర్ఎస్ పై కిష‌న్ రెడ్డి ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Sep 24, 2023, 2:59 PM IST

Hyderabad: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష ర‌ద్దు నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు అధికార బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జీ కిష‌న్ రెడ్డి స్పందిస్తూ.. ''ఉద్యోగ‌ నియామ‌క ప్ర‌క్రియ‌లో అవకతవకలను అరికట్టేందుకు దరఖాస్తుదారుల బయోమెట్రిక్ తప్పనిసరి అని నియామక నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. యువతకు చట్టబద్ధమైన ఉద్యోగాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వ నిబద్ధతను ఎత్తిచూపడానికి పరీక్ష రద్దు స్పష్టమైన నిదర్శనం'' అని పేర్కొన్నారు.


TS BJP State president G Kishan Reddy: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష రద్దుకు అధికార భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ పాలన, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పరీక్షను రద్దు చేసిన‌ట్టు ఆరోపించారు. రాష్ట్రంలో వరుసగా రెండోసారి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలను రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న నాలుగు లక్షల మంది నిరుద్యోగ యువతలో నిరుత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిప‌డ్డారు.

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడిన తెలంగాణలో నీళ్లు, నిధుల కోసం సతమతమవుతున్నాం. ఇప్పుడు రిక్రూట్ మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం యువతకు శాపంగా మారిందని మండిప‌డ్డారు. ''ఉద్యోగ‌ నియామ‌క ప్ర‌క్రియ‌లో అవకతవకలను అరికట్టేందుకు దరఖాస్తుదారుల బయోమెట్రిక్ తప్పనిసరి అని నియామక నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. యువతకు చట్టబద్ధమైన ఉద్యోగాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వ నిబద్ధతను ఎత్తిచూపడానికి పరీక్ష రద్దు స్పష్టమైన నిదర్శనం'' అని పేర్కొన్నారు.

Latest Videos

undefined

హాల్‌టికెట్లపై ఫొటోలు లేకపోవడం, బయోమెట్రిక్ స్క్రీనింగ్ తొలగించడం వల్ల పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కొందరు అభ్యర్థులు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారని, పరీక్షలను రద్దు చేయడం తప్ప కోర్టు ముందు మరో మార్గం లేదని ఆయన అన్నారు. కాగా, గ్రూప్-1 క్యాడర్ ఆఫీసర్ల నియామకానికి జూన్ 11న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీ దేవి శనివారం అనుమతించారు.

పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్‌లను పొందకుండానే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహించిందని వాదిస్తూ పరీక్షకు హాజరైన ముగ్గురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థులకు జారీ చేసిన OMR (ఆప్టికల్ మెమరీ రీడ్) షీట్‌లలో హాల్ టికెట్ నంబర్ లేదని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ 'పరీక్ష నిర్వహించడంలో గానీ, పరీక్షకు హాజరైన అభ్యర్థుల డేటాను పరస్పరం అనుసంధానం చేయడంలో గానీ.. జాగ్రత్తగా ఉన్నట్లు కనిపించడం లేదు..' అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ప‌రీక్ష ర‌ద్దు చేస్తూ మ‌రోసారి నిర్వహించాల‌ని పేర్కొన్నారు.

click me!