ప్రభుత్వ స్కూళ్లలో పోస్టుల భర్తీ కోరుతూ మంత్రి సబితా కార్యాలయం ముట్టడి

Published : Dec 02, 2022, 02:30 PM ISTUpdated : Dec 02, 2022, 02:32 PM IST
ప్రభుత్వ స్కూళ్లలో పోస్టుల భర్తీ కోరుతూ మంత్రి సబితా  కార్యాలయం  ముట్టడి

సారాంశం

హైద్రాబాద్‌ నగరంలోని బషీర్‌బాగ్‌లో  తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  కార్యాలయాన్ని తెలంగాణ నిరుద్యోగ  జేఏసీ  ఆధ్వర్యంలో శుక్రవారంనాడు ముట్టడించారు. ఖాళీగా  ఉన్న ప్రభుత్వ  స్కూళ్లలోని పోస్టులను భర్తీ చేయాలనని డిమాండ్  చేశారు.  

హైదరాబాద్: నగరంలోని  బషీ‌ర్‌బాగ్ లో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  కార్యాలయాన్ని  తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు ముట్టడించారు. ఈ  ఆందోళన కార్యక్రమంలో  బీసీ సంక్షేమ సంఘం నేత, వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లోని  24వేల పోస్టులను భర్తీ చేయాలని  ఆందోళనకారులు డిమాండ్  చేశారు.

రాష్ట్రంలో  ఖాళీగా  ఉన్న  ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ  జేఏసీ డిమాండ్  చేసింది. రాష్ట్రంలో  అధికారంలోకి రాకముందు  ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ సర్కార్  అమలు చేయాలని నిరుద్యోగ  జేఏసీ డిమాండ్  చేసింది. రాష్ట్రంలో  నిరుద్యోగ యువత  ప్రభుత్వ  ఉద్యోగాల  కోసం  ఎదురుచూస్తున్నారన్నారు. ఖాళీగా  ఉన్న ప్రభుత్వ  ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా  ప్రభుత్వం  అన్ని చర్యలు తీసుకోవాలని   ఆందోళనకారులు డిమాండ్  చేశారుఈ విషయమై ప్రభుత్వం నుండి  స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?