21 రోజుల్లోనే జీహెచ్ఎంసీలో 4622కి చేరిన కరోనా కేసులు

By narsimha lodeFirst Published Jun 22, 2020, 12:19 PM IST
Highlights

ఈ నెల 1వ తేదీ నుండి 21వ తేదీ వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 4622 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదౌతున్న కేసుల్లో అత్యధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే రికార్డు కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.


హైదరాబాద్: ఈ నెల 1వ తేదీ నుండి 21వ తేదీ వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 4622 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదౌతున్న కేసుల్లో అత్యధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే రికార్డు కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.

లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. అయితే ఎక్కువ పరీక్షలు చేయడం వల్ల కేసులు ఎక్కువగా రికార్డు అవుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు.

also read:కాంగ్రెస్ నేత వి. హనుమంతరావుకు కరోనా: ఆసుపత్రిలో చికిత్స

ఈ నెల 1వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలో 79, జూన్ 1 నుండి 10వ తేదీ వరకు 1261, జూన్ 11 నుండి 15 వరకు 971, జూన్ 16 నుండి 21 వరకు 2,390 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 21 వరకు జీహెచ్ఎంసీలో 4622 కేసులు నమోదైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.

ఆదివారం నాటికి తెలంగాణలో కరోనా కేసులు 7,820కి చేరుకొన్నాయి.  ఆదివారం నాడు ఒక్కరోజే జీహెచ్ఎంసీ  పరిధిలో 659 కరోనా కేసులు నమోదయ్యాయి.తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కూడ కరోనా సోకింది.మరో వైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావుకు కూడ కరోనా సోకింది. ఆయన ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

click me!