తెలంగాణలో వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
Telangana Rain: తెలంగాణలో ఈ రోజు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇదే విధంగా రేపు కూడా వర్షాలు కరిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
రేపు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, కొమురంబీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. ఎల్లుండి కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికాపటి నుంచి మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్‌మెంట్ కూడా రేపు భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేసింది. దక్షిణ తెలంగాణ, యానాం సహా ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రేపటి వరకు పడే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది.