ఉమెన్స్ హాస్టల్‌లో అమ్మాయిలతో కలిసి చిందులు.. మరో వివాదంలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ..

Published : Sep 10, 2022, 11:34 AM ISTUpdated : Sep 10, 2022, 11:37 AM IST
ఉమెన్స్ హాస్టల్‌లో అమ్మాయిలతో కలిసి చిందులు.. మరో వివాదంలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ..

సారాంశం

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా వివాదాలకు కేంద్రబిందువుగా  మారుతున్నారు. తాజాగా వీసీ రవీందర్ గుప్తా.. యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్‌లో విద్యార్థినులతో కలిసి చిందులు వేశారు. 

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా వివాదాలకు కేంద్రబిందువుగా  మారుతున్నారు. ఇటీవల ఓ మహిళా మహిళా ప్రొఫెసర్‌ను తన చాంబర్‌లోకి పిలిచి దూషించినట్టుగా వీసీ రవీందర్ గుప్తా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా వీసీ రవీందర్ గుప్తా.. యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్‌లో విద్యార్థినులతో కలిసి చిందులు వేశారు. వివరాలు.. తెలంగాణ వర్సిటీలో ఏర్పాటు చేసిన గణేషుడి నిమజ్జం అనంతరం.. ఉమెన్స్ హాస్టల్ ఆవరణలో అమ్మాయిలు డీజే డాన్సులు చేశారు. అయితే అక్కడికి చేరుకున్న వీసీ రవీందర్ గుప్తా.. అమ్మాయిలతో కలిసి చిందులేశారు. ఉమెన్స్ హాస్టల్ గేట్ తెరిచేందుకు నిరాకరించిన సిబ్బందిపై ఆయన ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుస్తోంది. 

 వీసీ రవీందర్ గుప్తా వెంట మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు సైతం ఉన్నారు. ఈ సందర్భంగా వీసీ రవీందర్ గుప్తా.. డబ్బులను కూడా వెదజల్లినట్టుగా తెలుస్తోంది. ఉమెన్స్ హాస్టల్‌లో వీసీ చేసిన రచ్చకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీసీ రవీంద్ర గుప్తా వ్యవహార శైలిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపతున్నారు. వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించి విద్యాశాఖ ఉన్నతాధికారులు.. యూనివర్సిటీ నుంచి వివరణ కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక, వీసీ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రవీంద్ర గుప్తా.. తెలంగాణ యూనివర్సిటీ వీసీగా వచ్చిన నాటి నుంచి అనేక వివాదాలకు కారణమవుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu