సిద్దిపేట జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య..

Published : Sep 10, 2022, 10:14 AM IST
సిద్దిపేట జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య..

సారాంశం

సిద్దిపేట జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ములుగు  మండలం అడవి మజీద్‌లో చెట్టుకు ఉరి  వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను మహేష్, స్వప్నలుగా గుర్తించారు. 

సిద్దిపేట జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ములుగు  మండలం అడవి మజీద్‌లో చెట్టుకు ఉరి  వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను మహేష్, స్వప్నలుగా గుర్తించారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

ఇక, గత నెలలో జనగామ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామం భిక్యతండా వద్ద గల పల్లె ప్రకృతి వనం వద్ద గుగులోతు రాజు, ఓ యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుగులోతు రాజు వయస్సు 20 సంవత్సరాలు కాగా.. యువతి వయస్సు 16 సంవత్సరాలు. వివరాలు.. యువతి ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమెకు రాజుతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమంలో ఉన్నారు. 

అయితే వారి పెళ్లి ప్రతిపాదనను అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించడంతో.. వారు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఇక, అయితే రాజు బలవంతంగా తమ బిడ్డకు పురుగుల మందు తాగించి హత్యచేసి ఉంటాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక, రాజు హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?