పొరుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితి బాలేదు : పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jun 27, 2023, 3:29 PM IST
Highlights

పొరుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్ధితులు బాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రాష్ట్రంలోని మెట్రో, రైల్వే, ఎయిర్‌పోర్ట్‌లకు ఆర్టీసీలను అనుసంధానం చేస్తున్నామని పువ్వాడ స్పష్టం చేశారు. 

బీఆర్ఎస్ నేత, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్ధితులు బాలేదన్నారు. కానీ మన రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్టీసీ పరిస్ధితి మెరుగుపడిందని ఆయన తెలిపారు. కరోనా సమయంలో బస్సులు డిపోలకే పరిమితమై.. రోజుకు రూ.కోటి కూడా ఆదాయం రాలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ రూ.560 కోట్ల నష్టంతో వుందన్నారు. 

సంస్థను లాభాల బాట పట్టించేందుకు శ్రమిస్తున్నట్లు పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. 760 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చామని.. నాన్ ఏసీ, ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్‌లో నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న పాతబస్టాండ్‌లలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని మెట్రో, రైల్వే, ఎయిర్‌పోర్ట్‌లకు ఆర్టీసీలను అనుసంధానం చేస్తున్నామని పువ్వాడ స్పష్టం చేశారు. 

ALso Read: మేము ఎవరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదు.. చిన్న పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారు?: కేసీఆర్

ఇకపోతే.. నిన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ్యాట్రిక్ విజ‌యం సాధిస్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తంచేశారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గత అక్టోబర్ లో జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగుపెడుతూ.. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) గా మారింది. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరలో జరగనున్నాయి. తెలంగాణ పాలనా విధానం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసున‌ని అన్నారు. 

ఎవరు మెరుగైన పాలన అందించగలరో రాష్ట్ర ప్రజలకు తెలుసనీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాష్ట్రానికి ఏం ఇవ్వగలరో అలాంటి సమర్థులు ప్రతిపక్షంలో ఎవరూ లేరని అన్నారు. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయనీ, అయితే దేశవ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాల్లో తాము అధికారంలో ఉన్నా దక్షిణాది రాష్ట్రాలకు సమానమైన, మెరుగైన పాలనా నమూనాను ఎక్కడా ఆ రెండు పార్టీలు ప్రదర్శించలేదన్నారు.

ఇదిలావుండ‌గా, హైదరాబాద్ లోని కొంగర కలాన్ లో ఫాక్స్ కాన్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరుగుతుండటంపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నిర్మాణానికి నాంది పలుకుతూ నెల రోజుల క్రితమే భూమిపూజ జరిగింది. ప్రాజెక్టు శరవేగంగా అభివృద్ధి చెందడాన్ని అభినందించిన మంత్రి, సైట్ లో జరుగుతున్న పనులను వివరిస్తూ ట్విటర్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

click me!