పార్టీ మార్పుపై ఈటల స్పష్టీకరణ.. ‘సొంత పార్టీ నేతలే నేను బయటికి పోవాలని కోరుకుంటున్నారు’

By Mahesh KFirst Published Jun 27, 2023, 3:18 PM IST
Highlights

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు చిల్లరగాళ్లు తాను బీజేపీ బయటికి వెళ్లిపోవాలని చూస్తున్నారని, బీజేపీలోనే కొందరు నేతలు తాను పార్టీ మారాలని కోరుకుంటున్నారని వివరించారు. కానీ, తాను అంత సులువుగా నిర్ణయం తీసుకోనని అన్నారు.
 

ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై కొంత స్పష్టత ఇచ్చారు. తాను బీజేపీ నుంచి వెళ్లిపోవాలని తన సొంత పార్టీ నేతలే కొందరు కోరుకుంటున్నారని అన్నారు. అలా తాను బయటికి వెళ్లిపోవాలని కోరుకునేవారు ఎవరో కూడా అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. తనను కించపరిచే వాళ్లూ బీజేపీలో ఉన్నారని వివరించారు. కానీ, వాళ్ల గురించి తాను పట్టించుకోనని చెప్పారు. పార్టీ మార్పు నిర్ణయాన్ని తాను అంత సులువుగా తీసుకునేవాడిని కాదని స్పష్టం చేశారు. తద్వార బయట ప్రచారం జరుగుతున్నట్టుగా తాను ఇప్పటికిప్పుడే పార్టీ మారబోవడం లేదనే సంకేతాలు ఇచ్చారు.

బట్టలు మార్చినంత సులువుగా పార్టీలు మారేవారు కొందరు ఉంటారని, కానీ, తాను అలా కాదని అన్నారు. కొందరు చిల్లరగాళ్లు తాను బయటికి వెళ్లిపోవాలని కోరుకుంటున్నారని, ఎప్పుడెప్పుడు వెళ్లిపోతాడా? అని మరికొందరు ఎదురుచూస్తున్నారని చెప్పారు. భగావో అని చెప్పేవాళ్లు, తనను అవమానించేవాళ్లు కూడా బీజేపీలో ఉన్నారని వివరించారు. కానీ, తాను అంత ఈజీగా నిర్ణయం తీసుకోబోనని స్పష్టం చేశారు.

Latest Videos

Also Read: కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే.. తెలంగాణ కూడా దక్కదు: సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు

టీఆర్ఎస్ పార్టీ తనను బయటికి పంపిస్తే.. బీజేపీ పార్టీ అండగా నిలిచిందని ఈటల రాజేందర్ చెప్పారు. తన లక్ష్యం కేసీఆర్ ఓటమేనని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే అని వివరించారు. కేసీఆర్‌ను వదిలిపెట్టే ఆలోచనే లేదని అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌కు అహంకారం పెరిగిందని ఈటల అన్నారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే సత్తా లేనాయన.. ఇంకేదో చేస్తారని తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదని, కేసీఆర్ అంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారని పేర్కొన్నారు.

click me!