విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. సమాచారం లేదన్న ప్రభాకర్ రావు , ముఖ్యమంత్రి పిలిస్తే ఎందుకు వెళ్లను

By Siva Kodati  |  First Published Dec 8, 2023, 2:53 PM IST

విద్యుత్ శాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశానికి తాను సమాచారం లేదన్నారు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు. ముఖ్యమంత్రి పిలిస్తే ఎందుకు వెళ్లనని ఆయన ప్రశ్నించారు. 


విద్యుత్ శాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశానికి తాను సమాచారం లేదన్నారు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు. ముఖ్యమంత్రి పిలిస్తే ఎందుకు వెళ్లనని ఆయన ప్రశ్నించారు. సీఎంవో నుంచి కూడా తనకు ఆహ్వానం రాలేదని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. 

కాగా.. కాంగ్రెస్ ప్రధాన హామీల్లో ఒకటైన 24 గంటల విద్యుత్‌ను నెరవేర్చేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి చర్యలు ప్రారంభించారు. దీనిలో భాగంగానే శుక్రవారం సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్, విద్యుత్ శాఖ జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఇతర విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest Videos

ALso Read: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా గడ్డం ఎందుకు తీయలేదు?

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ,కొనుగోలుపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా 2014 జూన్ 2 కంటే ముందు పరిస్ధితులు.. తెలంగాణ ఏర్పడ్డాక విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్ధితులపై వివరాలు సమర్పించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంతటి కీలక సమావేశానికి ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంట్లోనే ఉన్నప్పటికీ ఈ సమావేశానికి ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. దీనికి తోడు ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దని అధికారులను సీఎం ఆదేశించడం కూడా కలకలం రేపుతోంది. ప్రధానంగా విద్యుత్ శాఖకు సంబంధించి రూ.85 వేల కోట్ల నష్టం వచ్చినట్లుగా అధికారులు చెప్పడంతో రేవంత్ సీరియస్ అయ్యారు. తాజా పరిస్ధితుల నేపథ్యంలో ప్రభాకర్ రావు వ్యవహారం చర్చనీయాంశమైంది. 

click me!