Telangana: దేశంలో తెలంగాణకు టాప్ ప్లేస్

Published : May 20, 2025, 10:51 PM IST
telangana govt

సారాంశం

Telangana: 2023–24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ పర్-క్యాపిటా జీఎస్‌వీఏ రూ.3.5 లక్షలకు చేరి దేశంలో అగ్రస్థానానికి చేరింది. తొమ్మిది సంవత్సరాలలో ఇది రెట్టింపు కంటే ఎక్కువ అయింది. 

Telangana tops India in per capita GSVA: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే దేశంలో టాప్ ప్లేస్ సాధించింది. తెలంగాణ రాష్ట్రం 2023–24 ఆర్థిక సంవత్సరానికి పర్-క్యాపిటా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్‌ (GSVA) పరంగా దేశంలో అగ్రస్థానాన్ని సాధించింది. ఐసీఆర్ఏ (ICRA) సంస్థ తాజా అధ్యయనం ప్రకారం, తెలంగాణ 2014–15లో తొమ్మిదవ స్థానంలో ఉండగా, 2023–24 నాటికి మొదటి స్థానానికి చేరుకుంది.

2014-15లో తెలంగాణ పర్-క్యాపిటా జీఎస్‌వీఏ సుమారు రూ.1.25 లక్షలుగా ఉండగా, 2023-24 నాటికి ఇది రూ.3.5 లక్షల వరకు పెరిగింది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్ర GSVAలో దాదాపు రెండింతల కంటే ఎక్కువ‌ పెరుగుదల నమోదైంది.

వ్యవసాయ రంగంలో తెలంగాణ CAGR 6.2 శాతం

ఇదే కాలంలో తెలంగాణ GSVA కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR) సుమారు 6.8 శాతంగా ఉంది, ఇది జాతీయ సగటు 5.8 శాతం కంటే ఎక్కువ‌. వ్యవసాయ రంగంలో తెలంగాణ CAGR 6.2 శాతంగా నమోదైంది, ఇందులో పంటల విభాగంలో 6 శాతం వృద్ధితో ఇతర రాష్ట్రాలను వెనక్కి నెట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో 7.2 శాతంతో అత్యధిక వృద్ధిని నమోదుచేసింది. ఇది ప్రధానంగా మత్స్య పరిశ్రమ ఆధారంగా ఉంది.

2015–2023 కాలంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు తమ మూలధన వ్యయాల్లో 30 నుంచి 50 శాతం వరకు నీటిపారుదల రంగానికి కేటాయించాయి. తెలంగాణలో నీటిపారుదల విస్తరణ 2015తో పోల్చితే 2023లో సుమారు 26 శాతాలు పెరిగింది. ఇది వ్యవసాయ రంగ వృద్ధికి పెద్ద బూస్ట్ గా నిలిచింది.

పరిశ్రమల రంగం ప్రగతిలో జాతీయ సగటు దాటేసిన తెలంగాణ 

పరిశ్రమల రంగంలో కూడా తెలంగాణ CAGR 6–7 శాతం మధ్యన నమోదైంది, ఇది జాతీయ సగటు 5.7 శాతం కంటే ఎక్కువ‌. సేవల రంగంలో, బీహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు 6.5-6.9 శాతం CAGRతో జాతీయ సగటును అధిగమించాయి. సేవల రంగంలోని ట్రేడ్ విభాగంలో తెలంగాణ 9 శాతం వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. రియల్ ఎస్టేట్ విభాగంలో 8 శాతం, రవాణా రంగంలో 7 శాతం వృద్ధిని తెలంగాణ సాధించింది.

ఈ అన్ని రంగాలలో చూపిన సమగ్ర అభివృద్ధి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా అత్యధిక పర్-క్యాపిటా జీఎస్‌వీఏను సాధించిన రాష్ట్రంగా నిలిచింది. 2023–24లో టాప్ మూడు రాష్ట్రాలుగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నిలిచాయి. ఇవి 2014-15లో ఉన్న హర్యానా, ఉత్తరాఖండ్, కేరళ స్థానాలను భర్తీ చేశాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గద్దర్ అన్నకు కార్ కొనించానని చెప్పడానికి సిగ్గు లేదు..! | Kavitha Aggressive Words On Pawan Kalyan
చెరువు కబ్జా పై Pawan Kalyan కు కౌంటర్ ఇచ్చిన Kalvakuntla Kavitha | Asianet News Telugu