మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డి ఆదివారం అర్దరాత్రి హంగామా సృష్టించాడు. తాగిన మైకంలో కారునడిపి ఇద్దరి ప్రాణాలమీదకు తెచ్చాడు.
హైదరాబాద్ : తాగిన మైకంలో కారు నడిపి ఇద్దరి ప్రాణాలమీదకు తెచ్చారు ముగ్గురు యువకులు. గత అర్ధరాత్రి పబ్ లో ఫుల్లుగా తాగి ఆ మైకంలోనే యువకులు రోడ్డుపైకి వచ్చారు. ఈ క్రమంలో రాంగ్ రూట్ లో కారును వేగంగా పోనిచ్చి బైక్ పై వెళుతున్న ఇద్దరి ప్రాణాలమీదకు తెచ్చారు. ఈ ఘటన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ (కెపిహెచ్‌బి) కాలనీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డి ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి పబ్ కు వెళ్లాడు. మద్యం సేవించిన అగ్రజ్ స్నేహితులు కార్తిక్, తేజ లతో కలిసి బయటకు వచ్చాడు. మత్తులో వున్న ఈ ముగ్గురు అలాగే కారును కెపిహెచ్‌బి వైపు పోనిచ్చారు. ఫోరం మాల్ సర్కిల్ వద్ద కారును రాంగ్ రూట్ లో వేగంగా పోనివ్వడంతో ఘోరం జరిగింది. వీరి కారు అతివేగంతో వెళ్లి బైక్ ను ఢీకొట్టింది... దీంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
undefined
ఈ ప్రమాదంగురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కారు నడిపిన మంత్రి మేనల్లుడు అగ్రజ్ రెడ్డికి బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా మద్యం తాగినట్లు తేలింది. దీంతో పోలీసులు ఐపిసి 185(A), 337, 119,117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ముగ్గురు యువకులు పోలీసుల ఆధీనంలోనే వున్నారు.
Also Read Siddipet: ట్రాన్స్ జెండర్ గా మారిన భర్త.. రూ.18 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య!
ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరూ రాజస్థాన్ కు చెందిన దూర్ చంద్, భన్వర్ లాల్ గా పోలీసులు గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన వీరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని... ఒకరి పరిస్థితి సీరియస్ గా వున్నట్లు సమాచారం.