గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు: కేసీఆర్

By narsimha lodeFirst Published Mar 29, 2021, 10:31 PM IST
Highlights

వరి ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు.  గత ఏడాది మాదిరిగానే  గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు.  గత ఏడాది మాదిరిగానే  గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

సోమవారం నాడు ప్రగతి భవన్ లో  వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.  రాష్ట్రంలో 6408 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కరోనా నేపథ్యంతో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.వరి పంటలు ఎండిపోకుండా  పూర్తిస్థాయిలో సాగు నీరు అందించేందుకు  చర్యలు చేపట్టాాలని ఆయన అధికారులను ఆదేశించారు.

వరి ఎండిపోకుండా సాగు నీటిని అందించాాలని ఆయన అధికారులను కోరారు. సూర్యాపేట జిల్లాలోని చివరి భూములకు నీరందించాలని ఆయన అధికారులకు సూచించారు. ఏ పరిస్థితుల్లో కూడ ఎకరం పంట కూడ ఎండిపోవద్దని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మార్కెటింగ్ శాఖాధికారులు పాల్గొన్నారు. 

click me!