హైద్రాబాద్‌లో నడిరోడ్డుపైనే మహిళ ప్రసవం: వైద్యం అందక శిశువు మృతి

Published : Mar 29, 2021, 08:33 PM IST
హైద్రాబాద్‌లో నడిరోడ్డుపైనే  మహిళ ప్రసవం: వైద్యం అందక శిశువు మృతి

సారాంశం

 హైద్రాబాద్ జవహర్ నగర్‌లో రోడ్డుపైనే ఓ మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే సకాలంలో వైద్యం అందక పుట్టిన శిశువు మరణించాడు. నడిరోడ్డుపైనే ఉన్న బాలింతను స్థానికులు గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్: హైద్రాబాద్ జవహర్ నగర్‌లో రోడ్డుపైనే ఓ మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే సకాలంలో వైద్యం అందక పుట్టిన శిశువు మరణించాడు. నడిరోడ్డుపైనే ఉన్న బాలింతను స్థానికులు గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు.

హైద్రాబాద్ జవహర్ నగర్ లో ఓ గర్భిణీ ప్రసవం కోసం సోమవారం నాడు వెళ్లింది. అయితే వైద్యులు లేకపోవడంతో ఆమె తిరిగి వస్తుండగానే నడిరోడ్డుపైనే ప్రసవించింది. మగ పిల్లాడికి ఆమె జన్మనిచ్చింది.

సకాలంలో వైద్యం అందని కారణంగా ఆ బాలుడు మరణించాడు.  ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే  అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చేవరకు  బాలుడు చనిపోయినట్టుగా 108 సిబ్బంది తెలిపారు.

నడిరోడ్డుపై స్పృహ లేకుండా ఉన్న  బాలింతను  108 సిబ్బంది గాంధీ ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ‌.. జ‌పాన్‌తో యంగ్‌ ఇండియా స్కిల్స్ వ‌ర్సిటీ ఒప్పందం
RTC: ఇక కండ‌క్ట‌ర్‌తో ప‌ని లేదు.. మీ టికెట్ మీరు తీసుకోవ‌చ్చు. ఆర్టీసీలో స‌రికొత్త ప్ర‌యోగం