నాగార్జునసాగర్ బైపోల్: డాక్టర్ రవికుమార్ పేరును ప్రకటించిన బీజేపీ

Published : Mar 29, 2021, 09:22 PM ISTUpdated : Mar 29, 2021, 09:55 PM IST
నాగార్జునసాగర్ బైపోల్: డాక్టర్ రవికుమార్ పేరును ప్రకటించిన బీజేపీ

సారాంశం

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని బీజేపీ సోమవారం నాడు ప్రకటించింది.  డాక్టర్ రవికుమార్ పేరును బీజేపీ ప్రకటించింది.  

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని బీజేపీ సోమవారం నాడు ప్రకటించింది.  డాక్టర్ రవికుమార్ పేరును బీజేపీ ప్రకటించింది.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి  ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్ధిని చివరి నిమిషం వరకు బీజేపీ ప్రకటించలేదు.టీఆర్ఎస్ అసంతృప్త నేతలను తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ భావించింది.  టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించిన తర్వాతే  అభ్యర్ధిని ప్రకటించాలని  ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.

also read:నాగార్జునసాగర్ బైపోల్: ఇంకా అభ్యర్ధిని ఫైనల్ చేయని బీజేపీ

ఇవాళ ఉదయం  టీఆర్ఎస్ తన అభ్యర్ధిని ప్రకటించింది. దివంగత  ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు నోముల భగత్ పేరును  టీఆర్ఎస్ ప్రకటించింది.టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించిన కొన్ని గంటల్లోనే  బీజేపీ అభ్యర్ధిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన  డాక్టర్ రవికుమార్ నాయక్ పేరును  బీజేపీ ప్రకటించింది.

దుబ్బాక అసెంబ్లీ స్థానంలో బీజేపీ విజయం సాధించింది.  అయితే దుబ్బాక తరహా మాదిరిగానే  నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో బీజేపీ ప్లాన్ చేస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

Telangana: ఇక‌పై 100 కాదు.. తెలంగాణ‌లో ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ మారిపోయింది, కొత్త నెంబ‌ర్ ఏంటంటే
రూ. 1641 కోట్ల‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం.. ఈ రెండు ప‌ట్ట‌ణాల మ‌ధ్య త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం