సుప్రీంకోర్టుకు తాకిన తెలంగాణ డిఎస్సీ అభ్యర్థుల గోడు (ఫొటోలు)

Published : Sep 07, 2017, 11:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
సుప్రీంకోర్టుకు తాకిన తెలంగాణ డిఎస్సీ అభ్యర్థుల గోడు (ఫొటోలు)

సారాంశం

నిరుద్యోగుల గోడు పట్టించుకోని తెలంగాణ సర్కారు టీచర్ పోస్టుల భర్తీలో అలసత్వం నేరుగా సుప్రీంకోర్టుకు లేఖలు రాసిన అభ్యర్థులు నిరుద్యోగ వర్గాల్లో సంచలనం

టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి టీచర్ పోస్టుల భర్తీ ఊసే లేకుండా పోయింది. తెలంగాణ సర్కారు టీచర్ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపనలు బలంగా వినిపిస్తున్నాయి. సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం అటు నిరుద్యోగులను ఇటు పేద విద్యార్థులను ఏక కాలంలో మోసం చేస్తోందని నిరుద్యోగ యువత మండిపడుతోంది.

అదిగో డిఎస్సీ, ఇదిగో డిఎస్సీ అంటూ కాలయాపన చేస్తోంది తెలంగాన సర్కారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 70సార్లకు పైగా డిఎస్సీపై ప్రకటనలు చేయడం నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించడం తర్వాత వాయిదా వేయడం జరుగుతోంది. ఈ సమయంలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టు తెలంగాణ సర్కారుకు మొట్టికాయలేసింది. సర్కారు అలసత్వ తీరును ఎండగట్టింది. అయినప్పటికీ తెలంగాణ సర్కారు టీచర్ పోస్టుల భర్తీకి ససేమిరా అంటోంది.

దీంతో ఈనెల 11న సుప్రీంకోర్టులో మరోసారి టీచర్ పోస్టుల భర్తీపై కేసు విచారణకు రానుంది. దీంతో తెలంగాణ సర్కారు  తమ గోడు పట్టించుకోంకుడా అమానుషంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు నిరుద్యోగ అభ్యర్థులు.

తమ గోడును సుప్రీంకోర్టుకు చేరేలా వారు పోస్టు కార్డుల మీద తమ విన్నపాలు రాసి సుప్రీంకోర్టుకు పోస్ట్ చేశారు. ఇలాగైనా తమ విషయంలో తెలంగాణ సర్కారు కరుణిస్తుందేమోనన్న ఆశతో ఉన్నారు. గురువారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు పోస్ట్ కార్డుల ఉద్యమానికి తెర తీశారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu