కాంగ్రెస్ పార్టీని శపించిన మంత్రి తుమ్మల

Published : Sep 07, 2017, 08:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
కాంగ్రెస్ పార్టీని శపించిన మంత్రి తుమ్మల

సారాంశం

  ‘‘కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో జీవించలేదు...’’ శపించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 

బైసన్ గ్రౌండ్స్ లో సెక్రటేరియట్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్  ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో టిఆర్ ఎస్ నాయకత్వం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్  కుమార్ రెడ్డి మీద అన్ని వైపుల నుంచి దాడి ప్రారంభించింది. ఇందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు ఆయన నిప్పులు చిమ్మారు.

ఖమ్మ జిల్లా నేలకొండపల్లి లో మట్లాడుతూ తుమ్మల ఉత్తమ్ మీద తీవ్రంగా విరుచుకు పడ్డారు.

ఏదో కాలం కలిసొచ్చి ఎమ్మెల్యే అయినవాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బాగా మిడిసి పడుతున్నాడని తుమ్మల వాఖ్యానించారు.అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి ఎవరూ లేకనే  ఉత్తమ్ కుమార్ రెడ్డిని  పిసిసి నేతను చేశారని కూడా అన్నారు. 

సెక్రెటేరియట్ కడుతూ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడానికి తెలంగాణ ఎవడబ్బసొత్తు కాదని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శను ఉటంకిస్తూ ‘‘మరీ మీ అబ్బసొత్తా...?? ఈ తెలంగాణ 
ప్రజల సొత్తు,ప్రజల ఆస్తి ఈ తెలంగాణ ..’’ అని అన్నారు.

తుమ్మల ఇంకా ఎలా శాపనార్థాలు పెట్టారో చూడండి...

పట్టపగలు దోచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్.,రైతులను వంచించిన పార్టీ కాంగ్రెస్..

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ గాలికి కొట్టకు పోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మనజాలదు... అని శపిస్తూ ఖమ్మం జిల్లా లో కాంగ్రెస్ ను అంతం చేస్తామని తుమ్మల శపథం చేశారు.

 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.