
తెలంగాణ సర్కారు రైతు సంఘాల పేరుతో తీసుకొచ్చిన రెండు జిఓలు కూడా డేంజరస్ జిఓలే అని తెలంగాణ జెఎసి అభిప్రాయపడింది. స్థానిక సంస్థల అధికారాలను హరిస్తూ ,తన చెప్పు చేతుల్లో ఉండే వారితో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ జీవో 39,42 లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని జెఎసి ఛైర్మన్ కోదండ రాం ఆరోపించారు.
ఈ జీవో లు అత్యంత అప్రజాస్వామిక మైనవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోలకు వ్యతిరేకంగా తెలంగాణ జేఏసీ అఖిల పక్ష సమావేశాన్ని 8.9.2016 న సాయంత్రం 4.00 గంటల నుండీ 7 గంటల వరకూ సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేస్తున్నదని కోదండరాం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి అన్ని ప్రజా సంఘాలు, అభ్యుదయ సంఘాల సభ్యులు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.