తెలుగు విద్యార్థికి రూ.2కోట్ల స్కాలర్ షిప్..!

By telugu news teamFirst Published Jul 14, 2021, 8:15 AM IST
Highlights

హై స్కూల్ స్థాయిలో శ్వేతారెడ్డి కనపరిచిన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు తమను మెప్పించాయని కాలేజ్ యాజమాన్యం తెలిపింది.

తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని శ్వేతా రెడ్డి(17) అరుదైన అవకాశం దక్కింది. అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ సదరు విద్యార్థిని కి ఏకంగా రూ.2కోట్ల స్కాలర్ షిప్ ఆఫర్ చేసింది. లాఫాయేట్ కాలేజీలో 4ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ ( మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్ తో పాటు ఈ స్కాలర్ షిప్ ను ప్రకటించింది.

డైయర్ ఫెలోషిప్ పేరిట కాలేజీ ఇచ్చే ఈ స్కాలర్ షిప్ కు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరుగురు మాత్రమే ఎంపికవ్వగా.. అందులో శ్వేతారెడ్డి ఒకరు కావడం విశేషం. హై స్కూల్ స్థాయిలో శ్వేతారెడ్డి కనపరిచిన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు తమను మెప్పించాయని కాలేజ్ యాజమాన్యం తెలిపింది.

స్కాలర్ షిప్ సాధించడం పట్ల శ్వేతా హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. తనకు ఇలాంటి అద్భుత అవకాశం రావడం వెనక డెక్స్ టెరీటీ గ్లోబల్ సంస్థ ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం ఉందని.. దాని వల్లే తాను ఈ స్కాలర్ షిప్ అందుకోగలిగానని చెప్పింది. 

click me!