సర్పంచి ఘాతుకం.. ఉపాధి హామీ ఉద్యోగిపై పెట్రోలు పోసి..

By telugu news teamFirst Published Jul 14, 2021, 7:40 AM IST
Highlights

దీంతో.. ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. కాగా.. సర్పంచి ముందస్తు పథఖం ప్రకారం వెంట తెచ్చుకున్న పెట్రోల్ తీసి.. రాజుపై పోసి నిప్పు అంటించాడు.

బిల్లు కోసం ఓ సర్పంచి దారుణానికి పాల్పడ్డాడు. ఉపాధి హామీ పథకం ఉద్యోగిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కుభీరు మండలం పాత సాంవ్లీ గ్రామ సర్పంచి సాయి నాథ్ మంగళవారం సాయంత్రం ఉపాధి హామీ పథకం కార్యాలయానికి వచ్చాడు.

సాంకేతిక సహాయకుడు రాజును మస్టర్ల పై సంతకాలు చేయాలని కోరాడు. కూలీలు చేయని పనులకు సంతకం చేయనని అతను తేల్చి చెప్పాడు. దీంతో.. ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. కాగా.. సర్పంచి ముందస్తు పథఖం ప్రకారం వెంట తెచ్చుకున్న పెట్రోల్ తీసి.. రాజుపై పోసి నిప్పు అంటించాడు.

కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందించి బకెట్లతో నీళ్లు పోసి ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రాజు రెండు చేతులు, ఛాతీ భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు రాజును భైంసాలోని ఓ ఏరియా ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నించినా.. అందరికీ తెలిసిపోయింది. దీంతో... సర్పంచి పై చర్యలు తీసుకోవాలంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 
        

click me!