తెలంగాణలో కొత్తగా 767 మందికి పాజిటివ్.. 6,33,146కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Jul 13, 2021, 09:34 PM IST
తెలంగాణలో కొత్తగా 767 మందికి పాజిటివ్.. 6,33,146కి చేరిన కేసులు

సారాంశం

తెలంగాణలో కొత్తగా 767 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల నిన్న ఒక్కరోజు ముగ్గురు మరణించగా.. 848 కోలుకున్నారు.  ప్రస్తుతం తెలంగాణలో 10,064 మందికి చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో కరోనా అదుపులోనే వుంది. గడిచిన 24 గంటల్లో 1,18,778 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 767 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 84 కొత్త కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 77 కేసులను గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో 65, పెద్దపల్లి జిల్లాలో 59, నల్గొండ జిల్లాలో 52 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక కేసు నమోదైంది.

అదే సమయంలో రాష్ట్రంలో కోవిడ్ నుంచి 848 మంది కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజాగా మృతి చెందిన వారితో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు 3,738 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,33,146 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,19,344 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 10,064 మందికి చికిత్స పొందుతున్నారు.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 34, జీహెచ్ఎంసీ 77, జగిత్యాల 17, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి 14, గద్వాల 1, కామారెడ్డి 4, కరీంనగర్ 51, ఖమ్మం 84, ఆసిఫాబాద్ 3, మహబూబ్‌నగర్ 6, మహబూబాబాద్ 20, మంచిర్యాల 65, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 26, ములుగు 18, నాగర్ కర్నూల్ 6, నల్గగొండ 52, నారాయణపేట 2, నిర్మల్ 3, నిజామాబాద్ 5, పెద్దపల్లి 59, సిరిసిల్ల 17, రంగారెడ్డి 42, సిద్దిపేట 19, సంగారెడ్డి 9, సూర్యాపేట 29, వికారాబాద్ 3, వనపర్తి 4, వరంగల్ రూరల్ 17, వరంగల్ అర్బన్ 49, యాదాద్రి భువనగిరిలో 17 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather