నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే...: కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి తలసాని ఫైర్

By Nagaraju penumalaFirst Published Jun 29, 2019, 4:43 PM IST
Highlights

ప్రజవసరాల కోసం అప్పులు చేస్తే తప్పేంటో చెప్పాలని  నిలదీశారు. నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతిఆయోగ్ సమావేశానికి హాజరుకాకపోయినంత మాత్రాన ఎలాంటి నష్టం జరగలేదన్నారు. 
 
హైదరాబాద్: నోరున్నది కదా అని బీజేపీ నేతలు ఫిరాయింపులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మరి ఇప్పుడు బీజేపీ చేస్తుందేంటని నిలదీశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆర్థికంగా చతికిలపడిన దేశాన్ని గాడిలో పెట్టిన వ్యక్తి దివంగత ప్రధాని పీవీ నరసింహారావు అంటూ ప్రశంసించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. 

పీవీ నరసింహారావు దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గౌరవించలేకపోయిందన్నారు. దివంగత ప్రధాని అయి ఉండి ఆయనను గౌరవించకుండా పోయి విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. 

పీవీ నరసింహారావు జయంతి వేడుకలను తాము ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అప్పులు రాష్ట్రమంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుందన్నారు. 

click me!