కేసీఆర్ సంగతి తేలుస్తా, పీసీసీ రేస్ లో లేను: భట్టి విక్రమార్క

Published : Jun 29, 2019, 04:30 PM IST
కేసీఆర్ సంగతి తేలుస్తా, పీసీసీ రేస్ లో లేను: భట్టి విక్రమార్క

సారాంశం

మరోవైపు తాను పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు. తాను రేసులో లేనని తేల్చి చెప్పారు. సీఎల్పీ పదవి వదిలేసి పీసీసీ పదవి అడిగే నాయకుడిని తాను కాదన్నారు. తనకు అప్పగించిన పదవిని సక్రమంగా నెరవేరుస్తానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.  కేసీఆర్ సంగతేంటో తేలుస్తానంటూ మండిపడ్డారు. కేసీఆర్ సంగతి అటు అసెంబ్లీలోనూ, ఇటు బయట ఎండగడతానని స్పష్టం చేశారు. 

అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారని చెప్పుకొచ్చారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం కట్టడం కాదని పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 

మరోవైపు తాను పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు. తాను రేసులో లేనని తేల్చి చెప్పారు. సీఎల్పీ పదవి వదిలేసి పీసీసీ పదవి అడిగే నాయకుడిని తాను కాదన్నారు. తనకు అప్పగించిన పదవిని సక్రమంగా నెరవేరుస్తానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌
Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం