కాంగ్రెస్ పదవికి వీహెచ్ రాజీనామా

Published : Jun 29, 2019, 03:51 PM IST
కాంగ్రెస్ పదవికి వీహెచ్ రాజీనామా

సారాంశం

రాహుల్ గాంధీ రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారు. గాంధీ కుటుంబం పక్కకి తప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదమన్నారు. పారాచూట్లకు టికెట్లు ఇవ్వడం వల్లే నష్టం వాటిల్లిందనిలేని చెప్పుకొచ్చారు. 

హైదరాబాద్: ఏఐసీసీ కార్యదర్శి పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఆందోళన నెలకొందని వీహెచ్ ఆరోపించారు. 

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీని ఒక్కరినే బాధ్యుడును చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించిన ప్రతీ ఒక్కరూ బాధ్యులేనని తెలిపారు. 

రాహుల్ గాంధీ రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారు. గాంధీ కుటుంబం పక్కకి తప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదమన్నారు. పారాచూట్లకు టికెట్లు ఇవ్వడం వల్లే నష్టం వాటిల్లిందనిలేని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం రాజీనామా చేశారు. తన హయాంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయిందని, రాహుల్ గాంధీ తరహాలోనే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కూడా రాజీనామా చేశారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌
Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం