Telangana Voters List: తుది ఓటర్ల జాబితా విడుదల.. తెలంగాణలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..? 

By Rajesh KarampooriFirst Published Feb 9, 2024, 6:19 AM IST
Highlights

Telangana Voters List: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ లోని ఓటర్ల వివరాలను తెలియజేస్తూ తుది జాబితా విడుదల చేసింది. 

Telangana Final Voters List : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. లింగ నిష్పత్తిలో మెరుగుదల చూపిస్తూ ప్రత్యేక సవరణ తర్వాత ఓటర్ల వివరాలను తెలియజేస్తూ తుది జాబితా విడుదల చేసింది. ఈ  తుది ఓటర్ల జాబితాను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ గురువారం విడుదల చేశారు.

తుది ఓటర్ల జాబితా ప్రకారం..తెలంగాణలో మొత్తం 3,30,37,113 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,64,47,132 మంది పురుషులు, 1,65,87,244 మంది మహిళలు, 2,737 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. 15,378 సర్వీస్ ఎలక్టర్లు,  3,399 ఓవర్సీస్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి జనవరి 6న 1,000 నుండి తుది జాబితాలలో 1009కి మెరుగుపడిందనీ,  18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో లింగ నిష్పత్తి 754 నుంచి 791కి చేరిందనీ తెలిపారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4,54,230 మంది, వికలాంగులు 5,28,405 మంది ఉన్నరని తెలిపారు. 

Latest Videos

తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన యువతీయువకులు కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని సీఈవో వికాస్ రాజ్ సూచించారు. తుది జాబితా ప్రచురించబడినప్పటికీ, ఓటర్ల జాబితాను నిరంతరం నవీకరణ చేయబడు తుందన్నారు. ఈ మేరకు ఏప్రిల్ 1, 2024, జూలై 1, 2024, అక్టోబర్ 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులతో సహా జాబితాలో లేని అర్హులైన వ్యక్తులందరూ చేర్చడానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

జనవరి 22లోపు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించారు. ఫిబ్రవరి 3 వరకు డ్రాఫ్ట్ రోల్‌లో 7,19,104 చేర్పులు, 5,26,867 తొలగింపులు,  4,21,521 సవరణలు జరిగినట్టు ఎన్నిక సంఘం తెలిపింది. ఓటర్లు.eci.gov.inలోకి లాగిన్ చేయడం ద్వారా లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ (VHA) ద్వారా వారు జతచేయబడిన పోలింగ్ స్టేషన్ వంటి వారి నమోదు వివరాలను తనిఖీ చేసుకోవచ్చని తెలిపారు. నమోదు చేసుకున్న వివరాలలో ఏవైనా పొరపాట్లు ఉంటే, ఓటర్లు ఫారమ్ 8ని ఉపయోగించి ఆన్‌లైన్ లేదా VHA లేదా BLO (బూత్ లెవల్ ఆఫీసర్) ద్వారా దిద్దుబాటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

click me!