ఎన్నికల వేళ అధికారుల దూకుడు.. ఇప్పటివరకు కోట్లు జప్తు చేశారో  తెలుసా..?

Published : Oct 13, 2023, 06:50 AM IST
ఎన్నికల వేళ అధికారుల దూకుడు.. ఇప్పటివరకు కోట్లు జప్తు చేశారో  తెలుసా..?

సారాంశం

Telangana Assembly Elections 2023: తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరుగును . ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చింది. అలాగే.. అధికారులు కట్టదిట్టమైన ఏర్పాటు, ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని కోట్ల నగదు సాధ్వీనం చేసుకున్నారో తెలుసా..? 

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు కట్టదిట్టమైన ఏర్పాటు, ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు నిర్వహించిన తనిఖీలు ప్రారంభించారు. ఈ తనిఖీల్లో రూ. 37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో సిఆర్‌పిసిలోని వివిధ సెక్షన్ల కింద 1196 మందిని అధికారులు అరెస్టు చేశారు.

గత నాలుగు రోజుల్లో రూ.20.43 కోట్ల నగదు, 31.979 కిలోల బంగారం, 350 కిలోల వెండి, 42 క్యారెట్ల వజ్రాలు సుమారు రూ.146.65 కోట్ల విలువైన నగదును లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్ర, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో జరిపిన విచారణలో రూ.86.92 లక్షల విలువైన 31,370 లీటర్ల మద్యం, రూ.89 లక్షల విలువైన 310 కేజీల గంజాయి, ఏడు వేల కేజీల బియ్యం, 440 చీరలు, 80 కుట్టు మిషన్లు, 87 కుక్కర్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నాయి. 

ఈ సమయంలోనే సిఆర్‌పిసిలోని వివిధ సెక్షన్ల కింద 1,196 మందిని అధికారులు అరెస్టు చేశారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రకారం.. రాష్ట్రంలో 89 అంతర్రాష్ట్ర , 169 రాష్ట్ర చెక్‌పోస్టులు నిర్మించబడ్డాయి. రాష్ట్రంలో 100 కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.

PREV
Read more Articles on
click me!