హైదరాబాద్ ప్రతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి, మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పై సమగ్ర సమాచారం తో కూడిన పుస్తకాన్ని అందించారు. ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీఎం కేసీఆర్‌తో ఫోటో దిగారు. ఆ ఫోటో తన ట్విట్టర్ అధికారిక హ్యాండిల్ లో పోస్టు చేశారు. దీంతో ఆ ఫోటో తెగ వైరల్ గా మారింది.
గత కొంత కాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కేటీఆరే తెలిపారు. కేసీఆర్‌కు వైరల్ ఫీవర్ వచ్చిందని తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సమయంలో ప్రగతి భవన్‌లోనే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందించింది. దీంతో సీఎం కేసీఆర్ మీడియా ముందుకు గానీ, బయటకు రాకుండా దాదాపు 24 రోజులైంది.
అప్పటి నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక ప్రతిపక్ష నాయకులు సీఎం కేసీఆర్ కు ఏమైందని ప్రశ్నించారు. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అయితే.. పెద్దాయనకు ఏమైంది? అని ప్రతీ సభలో, ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పలుమార్లు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై సైటెర్లు వేశారు.
మరోవైపు.. సీఎం కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుందనీ.. రేపోమాపో పులి బయటకు వస్తుందనీ, ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగిపోయే మేనిఫెస్టో విడుదల చేశారని మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు చెప్తూ వస్తున్నారు. వారు ఎంత చెప్పిన సీఎం కేసీఆర్ మాత్రం మీడియా ముందుకు రాలేదు. ఈ సమయంలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ మేనిఫెస్టో చర్చినట్టు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధిపై సమగ్ర సమాచారంతో పాలమూరు ప్రగతి నివేదిక పేరుతో పుస్తకాన్ని కేసీఆర్‌కు అందించారు.ఈ క్రమంలో.. సీఎం కేసీఆర్‌తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫోటో దిగారు. ఆ ఫోటో తన ట్విట్టర్ అధికారిక హ్యాండిల్ లో పోస్టు చేశారు.
ఈ ఫోటోను చూస్తే.. కేసీఆర్ కాస్తా నలతగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవాలని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నెటిజన్లు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 15 నుంచి కేసీఆర్ స్వయంగా ఎన్నికల సమరంలోకి దిగి.. హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభలో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు అభ్యర్థులకు బీ ఫాంలు ఇస్తారు. అందరికీ దిశానిర్దేశం చేస్తారు.
హైదరాబాద్ ప్రతిభవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పై సమగ్ర సమాచారం తో కూడిన పుస్తకాన్ని అందచేయడం జరిగింది. మహబూబ్ నగర్ లో జరిగిన అభివృద్ధిని శాఖల వారీగా, ఆకర్షణీయమైన ఫోటోలను పొందుపరిచి పుస్తకాన్ని… pic.twitter.com/pgZjEbQubd
— V Srinivas Goud (@VSrinivasGoud)