
తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు (stamps and Registration dept ) రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఒక్క మార్చి నెలలోనే దాదాపు రూ.1500 కోట్లు ఆదాయం ఆర్జించినట్లుగా తెలుస్తోంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.12,364 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2020-21లో రూ.5,260 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ ఏడాది 12 వేల కోట్ల టార్గెట్‌ను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధిగమించింది.