Allu Arjun : అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే, న్యాయపోరాటమే.. ఆర్టీసీఎండీ సజ్జనార్

By AN TeluguFirst Published Nov 10, 2021, 2:07 PM IST
Highlights

Allu Arjun రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు కాబట్టి నోటీసులు ఇచ్చామని Sajjanar స్పష్టం చేశారు. ఇచ్చిన నోటీసులకు రిప్లై రాకపోతే న్యాయపరంగా ముందుకు వెళతామని చెప్పారు.

హైదరాబాద్ : సినీ హీరో అల్లు అర్జున్ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలని ఆ సంస్థ ఎండి సజ్జనర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. అల్లుఅర్జున్, ర్యాపిడో సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవు అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

Allu Arjun రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు కాబట్టి నోటీసులు ఇచ్చామని Sajjanar స్పష్టం చేశారు. ఇచ్చిన నోటీసులకు రిప్లై రాకపోతే న్యాయపరంగా ముందుకు వెళతామని చెప్పారు.

సెలబ్రిటీలు Commercial adsలో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలని సూచించారు.  డబ్బులకు ఆశపడి ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించ కూడదని సజ్జనార్ హితబోధ చేశారు.  సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు.  

ఎవరైనా తమ ప్రోడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు. కానీ ఇతర ప్రోడక్ట్ లను కించపరచకూడదు అనే విషయాన్ని గుర్తించాలని సజ్జనార్ తెలియజేశారు. ఆర్టీసీ తో ప్రతి ఒక్కరికి అనుబంధం  ఉంటుందని, తన బాల్యం, విద్యార్థి దశ, కాలేజీ జీవితం మొత్తం RTC తోనే ముడిపడి ఉందని చెప్పారు.  రాబోయే రోజుల్లో ఆర్టీసీ ప్రతిష్టను  పెంచుతామని అన్నారు.  నష్టాల నుంచి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని  ఆర్టిసి ఎండి  సజ్జనార్ తెలిపారు. 

కాగా,  భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బైక్ టాక్సీ యాప్ Rapido. తన మొట్టమొదటి సెలెబ్రిటీ క్యాంపైన్ 'స్మార్ట్ హో, తో ర్యాపిడో' ను లాంచ్ చేసింది. ప్రకటన ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్, రణవీర్ సింగ్ ఇద్దరూ చురుకైన తెలివైన వ్యక్తులు.. గురు ఇంకా బబ్బన్ పాత్రలను పోషించడం ద్వారా అభిమానులను అలరిస్తారు. 

వారి ప్రత్యేకమైన, ఆసక్తికరమైన పాత్రలు రోజువారీ ప్రయాణికులకు, బస్సులు/ఆటోల ద్వారా ప్రయాణించే ఇబ్బందులతో విసుగు చెంది, ర్యాపిడో వంటి స్మార్ట్ ఎంపికను ఎంచుకోవడానికి మార్గనిర్దేశం చేస్తాయి. ర్యాపిడో అందించే బైక్ టాక్సీలు సమయానుకూలంగా, అనుకూలమైన ఇంకా పాకెట్-ఫ్రెండ్లీ రైడ్‌లను అందించడానికి ట్రాఫిక్‌ను వేగంగా తగ్గించగలవు.

Allu Arjun: ఐకాన్‌ స్టార్‌కి సజ్జనార్‌ బిగ్‌ షాక్‌.. ప్రతిష్టని కించపరిచారంటూ నోటీసులు జారీ

ఈ ప్రచారం గురించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  “సాధ్యమైన ఉత్తమ పరిష్కారంతో పరిస్థితిని ఎలా పరిష్కరించాలో తెలిసిన వ్యక్తిగా నన్ను నేను పరిగణించాలనుకుంటున్నాను. అందుకే నాకు సరిపోయే గురు పాత్ర కోసం ర్యాపిడో నన్ను సంప్రదించినప్పుడు నేను చాలా ఉత్తేజితున్నయ్యాను. ర్యాపిడో చేస్తున్నది చాలా అసాధారణమైనది. ఈ ప్రచారంలో భాగమైనందుకు నేను సంతోషంగా ఉన్నాను, ఇది వారి మార్కెట్ ఉనికిని మరింత ఉన్నతస్థితికి చేరుకోవడంలో సహాయపడుతుంది. అని అన్నారు.

ఈ ప్రచారంలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ మాట్లాడుతూ “నేను ర్యాపిడోతో అనుబంధం కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాను. వారి మొదటి ప్రచారానికి వారితో కలిసి పనిచేయడం చాలా బాగుంది. ప్రత్యేకమైన, అసలైన స్టైల్, వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న ఒక విచిత్రమైన పాత్ర (బబ్బన్)ను పోషించడం వంటివి, ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ ఒక మంచి సంతోషకరమైన అనుభవాన్ని ఇచ్చాయి. ర్యాపిడో మార్గాలను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. నేను ఖచ్చితంగా విజయవంతమైన ప్రయత్నానికి నా వంతు సహకారం అందించడానికి నేను సంతోషిస్తున్నాను"అని అన్నారు.

click me!