స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎపెక్ట్: వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్

By narsimha lodeFirst Published Nov 10, 2021, 1:24 PM IST
Highlights

వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల  పాదయాత్రకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో  షర్మిల పాదయాత్రకు స్వల్ప విరామం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో  పాదయాత్రకు షర్మిల విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన వైఎస్ షర్మిల చేవేళ్ల నియోజకవర్గంలో  పాదయాత్రను ప్రారంభించారు. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవేళ్ల నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్రంలోని 12  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 9వ తేదీన విడుదలైంది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

దీంతో షర్మిల పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పాదయాత్ర నిర్వహిస్తే ఇబ్బంది. దీంతో పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలని పార్టీ నేతలు షర్మిలకు సూచించారు. దీంతో పాదయాత్రకు ఆమె బ్రేక్ ఇవ్వనున్నారు. షర్మిల పాదయాత్రను ప్రారంభించి ఇవాళ్టికి 22 రోజులు అవుతుంది.స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా ఈనెల 29న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన విజయ గర్జన సభను ఆ పార్టీ వాయిదా వేసుకొన్న విషయం తెలిసిందే.

also read:Prajaprasthanam Padayatra: పాదయాత్రకు బ్రేక్... 72 గంట‌ల నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన షర్మిల

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో YS Sharmila  పాదయాత్ర నిర్వహించేలా రూట్ మ్యాప్ రూపొందించుకొన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 14 పార్లమెంట్ నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగనుంది. 400 రోజుల పాటు 4 వేల కి.మీ దూరం Padayatra నిర్వహించాలని షర్మిల ప్లాన్ చేసుకొన్నారు. అయితే ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అక్కడే ఆమె పాదయాత్రను నిలిపివేయనున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి యాత్రను ప్రారంభించనున్నారు.

2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి  చేవేళ్ల నుండి పాదయాత్రను ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల గుండా 1475 కి.మీ. మేర పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర కారణంగానే అప్పట్లో అధికారంలో ఉన్న Tdp అధికారానికి దూరమై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.2017లో ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆవశేష అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్రను చేశారు. 13 నెలల పాటు 3648 కి. మీ. పాదయాత్ర నిర్వహించారు. 13 జిల్లాల్లో ఆయన పాదయాత్ర సాగింది. 2019 ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘన విజయం సాధించింది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం అనే పేరుతో పాదయాత్ర నిర్వహించాడు. 2012 అక్టోబర్ 2వ తేదీన అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించారు. 13 జిల్లాల్లో 2817 కి.మీ  దూరం పాదయాత్ర సాగింది. 2013 ఏప్రిల్ 28న విశాఖపట్టణంలో చంద్రబాబు పాదయాత్ర ముగిసింది. ఈ పాదయాత్ర ముగిసిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికారంలోకి వచ్చింది.చంద్రబాబు పాదయాత్ర సమయంలోనే షర్మిల ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పాదయాత్రను నిర్వహించారు. ఆ సమయంలో జగన్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

 


 

click me!