Viral Video:యువత ఏదో రకంగా సోషల్ మీడియా(Social media)లో వైరల్ కావాలని, రాత్రికి రాత్రే స్టార్లు కావాలని కుతూహలంతో రోడ్లు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, నడిరోడ్డు వంటి పబ్లిక్ ప్లేసుల్లో డ్యాన్సులు(Dance) చేస్తూ.. ప్రాంక్ వీడియోలు చేస్తూ.. పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి ఓ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేస్తూ.. విచారం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ వీడియో ఎంటీ? ఆయన అంతగా రియాక్ట్ కావడానికి కారణమేంటి? మీరు కూడా ఓ లూక్కేయండి.
Viral Video: ప్రస్తుత కాలంలో యువత ఏదో రకంగా సోషల్ మీడియా(Social media)లో ట్రెండ్ కావాలని, ఇంటర్‌నెట్‌లో వీడియో వైరల్(Video viral) అవ్వాలనే కుతూహలంతో రోడ్లు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, నడిరోడ్డు వంటి పబ్లిక్ ప్లేసుల్లో డ్యాన్సులు(Dance) చేస్తూ.. ప్రాంక్ వీడియోలు చేస్తూ.. పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్న జనానికి పరమ చిరాకు తెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని సార్లు ప్రమాదకర ప్రదేశాల్లో వీడియోలు చేస్తూ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్న సందర్భాలు కూడా కోకొల్లాలు. ఏదో రకంగా పాపులర్ కావాలని, ట్రై చేస్తూ పరువు బజారుకు ఈడ్చుకుంటున్నారు.
రీసెంట్‌గా ఓ యువతి నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ మారింది. ఆ యువతి ఏ ప్రాంతానికి చెందినదో తెలియదు కాని, పంజాబీ డ్రెస్ లో కాలేజీ బ్యాగ్ వేసుకున్న ఆ యువతి.. నడిరోడ్డుపై సిగ్నల్ పడగానే రోడ్డుపైకి వచ్చి.. ఓ బాలీవుడ్ పాటకు అనుగుణంగా రోడ్డుపై పడుకొని మరి స్టెప్పులేసింది. సడెన్ గా ఓ యువతి ఉన్నది ఉన్నట్టుగా రోడ్డుపైకి వచ్చి.. డ్యాన్స్ చేయడం చూసిన అక్కడి ప్రయాణికులు ఓ సారిగా నోరువెళ్లబెట్టారు. అయినా ఏవరెమనుకున్న నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఆ యువతి ప్రవర్తించింది.
undefined
ఈ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనదంమో.. ఏమో!?’ అంటూ కామెంట్ చేశారు. నెటిజెన్లు కూడా ఈ వీడియోపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి పిచ్చి వేశాలు వేసే వారిపై న్యూసెన్స్ కేసు పెట్టాలంటూ కొందరు డిమాండ్ కూడా చేశారు.
నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి… pic.twitter.com/RQ6aGEWUet
— V.C. Sajjanar, IPS (@SajjanarVC)