వరంగల్ బస్ డిపోలో కరోనా క‌ల్లోలం.. కండక్టర్‎కు కరోనా.. రెండు రోజులుగా విధుల్లో

Published : Jan 18, 2022, 12:35 PM IST
వరంగల్ బస్ డిపోలో కరోనా క‌ల్లోలం.. కండక్టర్‎కు కరోనా.. రెండు రోజులుగా విధుల్లో

సారాంశం

హన్మకొండ బస్ డిపోలో కరోనా కలకలం రేపుతోంది. వరంగల్ లోకల్ బస్సులో మహిళా కండక్టర్‌కి కరోనా సోకింది. 15 రోజుల పాటు సిక్ లీవ్‌లో ఉండి మహిళా కండక్టర్ వచ్చారు. రెండు రోజుల క్రితం డ్యూటీలో జాయిన్ అయినట్లు సమాచారం. శనివారం నుండి దగ్గు వస్తుండటంతో అధికారులు కరోనా టెస్ట్ చేయించారు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళనలో ఉంది.డ్యూటీ ఆఫీసర్‌కు కూడా కారోనా లక్షణాలు ఉన్నట్లు చెబుతున్నారు.  

తెలంగాణలో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. క‌రోనా పంజా విసర‌డంతో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య పెర‌గ‌డంతో.. ఒమిక్రాన్ వైర‌స్ కూడా చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పుడు సాధారణ ప్రజల్లోనూ నమోదవుతున్నాయి.  మరీ ముఖ్యంగా ప్రజలతో మమేకం కావ‌డంతో ప్ర‌జ‌లు  భయాందోళ‌న‌ల‌కు గురవుతున్నారు 
  
ఈ క్ర‌మంలో హన్మకొండ బస్ డిపోలో కరోనా కలకలం రేపింది. ఉదయం 11 గంటలకు చెన్నూర్ నుంచి హన్మకొండ‌కి వెళ్లాల్సిన హన్మకొండ డిపో బస్సులో లేడీ కండక్టర్‌గా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. 15 రోజుల పాటు సిక్ లీవ్‌లో ఉండి రెండు రోజుల క్రితం మహిళా కండక్టర్ విధుల్లో చేరిన‌ట్టు తెలుస్తోంది. ఆమె దగ్గు వస్తుండటంతో .. ఆరోగ్య శాఖ సిబ్బంది కరోనా టెస్ట్ చేయించారు. ఆ ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళనలో ఉంది.  డ్యూటీ ఆఫీసర్‌కు కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఖాళీ బస్సును అధికారులు తిరిగి హన్మకొండకు పంపించారు.

 అదేవిధంగా భద్రాద్రి జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ కూడా క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఈ పోలీస్ స్టేష‌న్ నుంచి ముక్కోటి ఏక‌ద‌శి విధులకు భద్రాచలం వెళ్లిన ఐదుగురు పోలీస్ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో పోలీసు 
స్టేషన్‌లో ఉన్న మిగతా సిబ్బందితో పాటు.. వారితో సన్నిహితంగా మెలిగిన వారు కూడా టెస్ట్‌లు చేయించుకుంటున్నారు.
 
ఇప్ప‌టికే క‌రోనా ఉధృతి పెర‌గ‌డంతో  విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   వైద్యారోగ్య శాఖ సిఫారసు మేరకు జనవరి 30 వరకు సెలవులు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Daughter Kills Parents: ప్రేమ పెళ్లి విషాదం.. తల్లిదండ్రులను హతమార్చిన కూతురు | Asianet News Telugu
Medaram Sammakka Saralamma Jatara 2026 Begins | 4000 Special RTC Buses | Asianet News Telugu