రైతుల చూపు కేసీఆర్ వైపే: సిద్దిపేట బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు

By narsimha lode  |  First Published Apr 2, 2023, 2:03 PM IST

రాష్ట్ర ప్రభుత్వం  అమలు  చేస్తున్న పథకాలతో  అన్ని  రాష్ట్రాలు  తెలంగాణ వైపు  చూస్తున్నాయని  మంత్రి హరీష్ రావు  చెప్పారు. నారాయణపేటలో  జరిగిన ఆత్మీయసమ్మేళనంలో  ఆయన  ప్రసంగించారు. 


సిద్దిపేట:దేశంలోని రైతులంతా  కేసీఆర్ వైపు చూస్తున్నారని  తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేటలో  నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో  మంత్రి హరీష్ రావు  ప్రసంగించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ స్వతహాగా  రైతు అని  మంత్రి  ఈ సందర్భంగా  ప్రస్తావించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు  కేసీఆర్ అనేక పథకాలను తీసుకువచ్చిన విషయాన్ని  హరీష్ రావు   వివరించారు.   రైతు  ఎజెండాగానే  కేసీఆర్ సర్కార్  పనిచేస్తుందని మంత్రి హరీష్ రావు  చెప్పారు.  రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం నుండి అనేక అవార్డులు వచ్చాయని  మంత్రి హరీష్ రావు గుర్తు  చేశారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  తెలంగాణ తరహలో  పథకాలను ఎందుకు  అమలు చేయడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. 

Latest Videos

అదానీ కి  ఇచ్చిన అప్పులను  కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. కానీ రైతుల పంటను మాత్రం కొనుగోలు చేసేందుకు   ముందుకు  రావడం లేదని  ఆయన  విమర్శించారు.  రాష్ట్రంలో  రైతు పండించిన  ప్రతి  వరిగింజను  కొనుగోలు  చేస్తామని  మంత్రి హరీష్ రావు  హామీ ఇచ్చారు. 

కాళేశ్వరం దండగ  అని  బీజేపీ, కాంగ్రెస్ నేతలు  విమర్శిస్తున్నారన్నారు.   కాళేశ్వరం ఉపయోగం  ఢిల్లీలో  ఉన్నవాళ్లకు  ఏం తెలుసునని  ఆయన  ప్రశ్నించారు.   కాళేశ్వరంపై  పెట్టిన పెట్టుబడి ఎప్పుడో  వచ్చిందన్నారు.  కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన  తర్వాత  తెలంగాణ తీరు మారిందని  ఆయన  గుర్తు  చేశారు. మన రాష్ట్రంలో  చెరువులు చూసేందుకు  మహారాష్ట్ర రైతులు  వచ్చి ఆశ్చర్యపోయారన్నారు.  డబుల్ ఇంజన్ సర్కార్  ఉన్న మహారాష్ట్రలో  నాలుగు రోజులకు ఓసారి  మంచనీళ్లు  సరఫరా చేస్తున్నారని హరీష్ రావు  విమర్శించారు.  

 దేశంలోని  16 రాష్ట్రాల్లో  బీడీ కార్మికులున్నా  ఎక్కడా  కూడా  పెన్షన్ అమలు కావడం లేదన్నారు. తమ ప్రభుత్వమే  బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తుందని  హరీష్ రావు గుర్తు  చేశారు.యూనిట్ విద్యుత్  ను రూ. 20లకు  కొనుగోలు  చేసి  రైతులకు ఉచితంగా ఇస్తున్నామని   మంత్రి  హరీష్ రావు  చెప్పారు.  30 ఏళ్ల నారాయణరావుపేట మండల కల కేసీఆర్  కారణంగా సాకారమైందన్నారు.   అవార్డులు లేకుండా ఈ మండలం పేరు లేనేలేదన్నారు.  కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోలేదని  ఆయన విమర్శించారు.  

రెండు సార్లు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ ను ఈ నెల 16వ తేదీన ప్రారంభించనున్నట్టుగా  మంత్రి హరీష్ రావు  తెలిపారు.  ఓట్ల కోసం కాదు ప్రజల కోసం అభివృద్ధి చేస్తున్నామని హరీష్ రావు  చెప్పారు.  గతంలో గంజి కేంద్రాలు, ఆకలి కేంద్రాలు ఉండేవన్నారు.   సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టుకుని గౌరవించామని  హరీష్ రావు  చెప్పారు.  మరో రెండు నెలల్లో సిద్దిపేటకు రైల్ వస్తుందన్నారు. 

click me!