
నెల దాటినా రైస్ మిల్లర్ల నుంచి ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేయలేదు. కొనుగళ్లపై ఎఫ్‌సీఐ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో తెలంగాణలో రైస్ మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో ధాన్యం గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుతో రాష్ట్రంలో రైస్ మిల్లులు మూగపోయే పరిస్ధితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైస్ మిల్లర్లు. రైతులకు కష్టం కలగొద్దనే ధాన్యం కొన్నామని.. ఇప్పుడు ప్రభుత్వం కొనకపోవడంతో ధాన్యం తడిసిపోయే పరిస్ధితి వచ్చిందని వారు వాపోతున్నారు. హైదరాబాద్ లో గురువారం సమావేశమైన రైస్ మిల్లర్లు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం మొలకలు వస్తున్నాయి.