హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు..

Published : Jul 07, 2022, 04:55 PM IST
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు..

సారాంశం

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్ 3లో అతివేగంతో ప్రయాణిస్తున్న అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. 

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్ 3లో అతివేగంతో ప్రయాణిస్తున్న అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకని వివరాలు సేకరించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారును సీజ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఇదిలా ఉంటే.. ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు‌పై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ