తెలంగాణలో 24 గంటల్లో 704 కరోనా కేసులు: మొత్తం 6,31,218కి చేరిక

By narsimha lodeFirst Published Jul 10, 2021, 7:54 PM IST
Highlights

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 704 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్న జిల్లాల్లో కారణాలను అన్వేషించాలని సీఎం ఆదేశించారు.
 


హైదరాబాద్: తెలంగాణలో  గత 24 గంటల్లో 704 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 6,31,218కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో 1,00,632 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ  ప్రకటించింది.  కరోనాతో గత 24 గంటల్లో  ఐదుగురు మరణించారు. 

ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,725కి చేరుకొంది. కరోనాతో ఒక్క రోజులో  917 మంది కోలుకొన్నారు.  రాష్ట్రంలో  కరోనాతో  కోలుకొన్నవారి సంఖ్య  6,16,769కి చేరింది. ప్రస్తుతం 10, 724 యాక్టివ్ కేసులున్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

తెలంగాణలో  లాక్ డౌన్  విధించిన తర్వాత కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కరోనా కేసుల పెరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సహా ఇతర ముఖ్య అధికారులను రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్న జిల్లాల్లో పర్యటించి కారణాలపై ఆరా తీయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 13వ తేదీన జరిగే కేబినెట్ సమావేశానికి నివేదిక ఇవ్వాలని  సీఎం కోరారు.


 

click me!