తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సిగరెట్‌,బీడీతో వైఎస్ఆర్ పోల్చాడు:వైఎస్ షర్మిలకు హరీష్‌రావు కౌంటర్

By narsimha lodeFirst Published Jul 10, 2021, 6:06 PM IST
Highlights


తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజల కోసం వైఎస్ఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటరిచ్చారు. తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించింది వైఎస్ఆరేనని ఆయన గుర్తు చేశారు. షర్మిలను ఆశీర్వదించాలా అని ఆయన ప్రశ్నించారు.

సదాశివపేట: వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రజల  ఆత్మగౌరవాన్ని సిగరెట్, బీడీతో పోల్చాడని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. వారి వారసులను మనం ఆశీర్వదించాలా అని ఆయన అడిగాడు. మా నీళ్లు, నిధులు దోచుకున్నందుకా ఆశీర్వదించాలా అని ఆయన అడిగారు.వంద కోట్ల మంది ఒప్పు కుంటేనే అని అవహేళన చేసినందుకు ఆశీర్వదించాలా అని ఆయన ప్రశ్నించారు.

సదాశివపేటలో పలు పార్టీల నుండి మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా శనివారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.  త్యాగాలతో తెలంగాణ వచ్చిందని ఆయన గుర్తు చేశారు.ఈ తెలంగాణ మీద మమ్మల్ని అవహేళన చేయడంతో పాటు తెలంగాణకు అడ్డుపడిన  వైఎస్ఆర్ కూతురును తెలంగాణలో పార్టీ పెడితే మద్దతివ్వాలా అని ఆయన అడిగారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో మీకు స్థానం లేదు...  ఉండదని ఆయన తేల్చి చెప్పారు.

కామన్ మినిమం ప్రోగ్రాం లో తెలంగాణ  ఇస్తామని పొత్తు పెట్టుకుని ఐదేళ్లు కాలయాపన చేసింది వై. ఎస్ కాదా అని ఆయన అడిగారు.
 తెలంగాణను అవమాన పరిచిన రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుండి ఆయన వారసులమని వస్తున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ గురించి మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి గొంతు నొక్కి అసెంబ్లీ నుంచి పంపించాడన్నారు.ఆరోజు కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడారని ఆయన విమర్శించారు. 

 అవకాశవాదులకు తెలంగాణలో స్థానం లేదని ఆయన చెప్పారు. ఆంధ్ర తొత్తులకు రాష్ట్రంలో చోటు లేదని ఆయన తేల్చి చెప్పారు.
 కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని గత ఎన్నికల్లో చంద్రబాబు వస్తే తెలంగాణ పొలిమేరల వరకు తెలంగాణ ప్రజలు తరిమి కొట్టారన్నారు.ఇప్పుడు కాంగ్రెస్ ముసుగులో రావడానికి వస్తే  తెలంగాణ లో ప్రజలు స్థానం ఇవ్వరని ఆయన చెప్పారు.తెలంగాణ అభివృద్ది కోసం ఆలోచించే వారికే  ప్రజలు స్థానం ఇస్తారని చెప్పారు.

 కేసీఆర్ మీద విశ్వాసంతో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తాగునీటి,విద్యుత్ కోత, ఎరువుల కొరతని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల్లో చేయలేని పనులు తెరాస 7సంవత్సరాల్లో చేసిందని గుర్తు చేశారు.

 మీకు అధికారం ఇస్తే ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు లేరు, నర్సులు లేరు, మందులు లేవన్నారు.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైన రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా.. రైతు బంధు ఇస్తున్నారా.. ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.గాంధీ భవన్ కు ఎక్కువ ప్రజల్లో తక్కువ అంటూ ఆయన కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉచిత కరెంటు ఇస్తున్నారా, ఇంటింటికి నల్లాల ద్వారా నీళ్లు ఇస్తున్నారా  అని ఆయన ప్రశ్నించారు.

click me!