చిన్నారులపై వరుస అత్యాచారాలు: నిందితుడు అభిరామ్ అరెస్ట్

Published : Jul 10, 2021, 06:33 PM IST
చిన్నారులపై  వరుస అత్యాచారాలు: నిందితుడు అభిరామ్ అరెస్ట్

సారాంశం

జవహర్ నగర్ లో    చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు.  వారం రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఒడిశాకు చెందిన అభిరామ్ జవహర్ నగర్ లో నివాసం ఉంటున్నాడు.


హైదరాబాద్: చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితుడు అభిరామ్ ను రాచకొండ పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ జవహర్ నగర్‌  పరిధిలో చిన్నారులపై అభిరామ్ అత్యాచారాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. వారం రోజులుగా ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. ఒడిశాకు చెందిన అభిరామ్  జవహర్ నగర్ లో కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. చిన్న పిల్లలకు చాక్లెట్లు, బిస్కట్లు ఆశచూపి వారిని  తనతో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

గురువారం నాడు కూడ చిన్నారిని నిందితుడు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఈ నెల 4వ తేదీన నిందితుడు మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని రాచకొండ పోలీసులు ప్రకటించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడు అభిరామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ అభిరామ్ ను అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు.చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే