తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు

Published : May 31, 2021, 07:48 PM IST
తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు

సారాంశం

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 87,1110 నమూనాలను పరీక్షించగా 2524 కరోనా కేసులు నమోదైనట్టుగా తెలంగాన వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య5,78,351కి చేరుకొన్నాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 87,1110 నమూనాలను పరీక్షించగా 2524 కరోనా కేసులు నమోదైనట్టుగా తెలంగాన వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య5,78,351కి చేరుకొన్నాయి.కరోనాతో గత 24 గంటల్లో 18 మంది మరణించారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 3,219కి చేరుకొంది.  రాష్ట్రంలో 34,084 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.  ఇవాళ కరోనా నుండి 3,464 మంది కోలుకొన్నారు.  రాష్ట్రంలో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 5,40,986కి చేరుకొంది. 

కరోనా రికవరీ రేటు 93.5 శాతానికి చేరుకొంది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 44.31 శాతంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ ను పొడిగించింది.  లాక్ డౌన్ విధించిన తర్వాత రాష్ట్రంలో కరోనా ేకసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. లాక్ డౌన్ ను పురస్కరించుకొని ఇవాళ్టి నుండి నిత్యావసర సరుకుల కొనుగోలుకు  మధ్యాహ్నం 1 గంట వరకు  ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?