జేపీ నడ్డాతో ఈటల భేటీ: బీజేపీలో చేరికపై చర్చ

Published : May 31, 2021, 07:24 PM IST
జేపీ నడ్డాతో ఈటల భేటీ: బీజేపీలో చేరికపై చర్చ

సారాంశం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ న్యూఢిల్లీలో సోమవారం నాడు భేటీ అయ్యారు.   

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ న్యూఢిల్లీలో సోమవారం నాడు భేటీ అయ్యారు. బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్  వారం రోజుల్లో చేరే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిలు  ఉన్నారు.

also read:నియంత కేసీఆర్ ను గద్దెదించడానికే..: ఈటల బిజెపిలో చేరికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీజేపీలో తన పాత్ర ఎలా ఉండనుందనే విషయమై ఈటల రాజేంర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడితో చర్చించనున్నారు. మరో వైపు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడ నడ్డాతో ఆయన చర్చిస్తారు. బీజేపీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేసే విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు. మంత్రివర్గం నుండి భర్తరఫ్  అయిన తర్వాత నియోజకవర్గంలో తన అనుచరులతో ఈటల రాజేందర్ సమావేశాలు నిర్వహించారు. బీజేపీలో చేరే విషయమై చర్చించారు.  

బీజేపీ రాష్ట్ర నేతలు బండి సంజయ్ తో పాటు పలువురు కీలక నేతలతో ఈటల రాజేందర్ చర్చించారు. బీజేపీలో చేరికకు రాష్ట్ర నాయకత్వం కూడ సానుకూలంగా స్పందించింది. ఈ విషయమై జాతీయ నేతలతో కూడ బండి సంజయ్ కూడ చర్చించారు. జాతీయ నాయకత్వం కూడ ఈటల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్