ఆర్ఆర్ఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published May 31, 2021, 6:18 PM IST
Highlights

 రీజినల్ రింగ్ రోడ్డు డీపీఆర్ తయారీ  కోసం కన్సల్టెన్సీలను పిలిచామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఈ టెండర్లను జూన్ 1వ తేదీన ఓపెన్ చేస్తామన్నారు.

హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు డీపీఆర్ తయారీ  కోసం కన్సల్టెన్సీలను పిలిచామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఈ టెండర్లను జూన్ 1వ తేదీన ఓపెన్ చేస్తామన్నారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  కరోనా కారణంగా రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన డీపీఆర్ పనుల తయారీ కోసం కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తూ టెండర్ల ప్రక్రియను మరింత పొడిగించిన విషయాన్ని గుర్తు చేశారు. జూన్ 1న ఈ టెండర్లను ఓపెన్ చేయనున్నట్టుగా ఆయన  చెప్పారు. 

తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డును మోడీ ఇచ్చిన అద్బుత కానుకగా ఆయన ప్రకటించారు.  రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే  రోడ్డు నిర్మాణం మరింత వేగంగా పూర్తి చేస్తామన్నారు. రూ. 17 వేల కోట్లతో 340 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు గేమ్ ఛేంజర్ లా ఉంటుందని ఆయన తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో ఇప్పటికే  హైద్రాబాద్ శివారు జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా కారణంగా కొంత రియల్ ఏస్టేట్ తగ్గింది. మరోసారి రీజినల్ రింగ్ రోడ్డు టెండర్ల విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంతో రీజినల్ రింగ్ రోడ్డు  వెళ్లే ప్రాంతాల్లో భూముల రేట్లకు డిమాండ్ ఉందని రియల్ ఏస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.


 

click me!