తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

Published : Jun 07, 2021, 08:52 PM IST
తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గత 24 గంటల్లో 1,933 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 1,32,996 మందిని పరీక్షిస్తే 1933 మందికి కరోనా సోకిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గత 24 గంటల్లో 1,933 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 1,32,996 మందిని పరీక్షిస్తే 1933 మందికి కరోనా సోకిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,93,103కి చేరుకొంది. కరోనాతో గత 24 గంటల్లో 16 మంది మరణించారు.  దీంతో కరోనాతో మరణించినవారి సంఖ్య 3,349కి చేరుకొంది. గత 24 గంటల వ్యవధిలో కరోనా నుండి  3527 మంది కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 25,406 కరోనా యాక్టివ్ కేసులున్నాయని  వైద్య ఆరోగ్యశాఖ  తెలిపింది. 

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ను విధించింది.ఈ నెల 8వ తేదీన నిర్వహించే కేబినెట్ సమావేశంలో లాక్‌డౌన్ పై చర్చించనున్నారు. లాక్‌డౌన్  పొడిగిస్తారా, ఎత్తివేస్తారా అనే విషయమై ఈ సమావేశంలో తేలనుంది.రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేసిన తర్వాత కరోనా కేసులు తగ్గినట్టుగా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Rugby Premier League: ముంబైని చితక్కొట్టిన హైదరాబాద్ హీరోస్.. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా
నల్గొండ భహిరంగ సభలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Inaugurates Development Works