జీహెచ్ఎంసీలో తగ్గని ఉధృతి: తెలంగాణలో 36,221కి చేరిన కరోనా కేసులు

By narsimha lodeFirst Published 13, Jul 2020, 9:59 PM
Highlights

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,550 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో సోమవారం నాటికి 36,221కి చేరుకొన్నాయి.
 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,550 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో సోమవారం నాటికి 36,221కి చేరుకొన్నాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,81,849 శాంపిల్స్ ను పరీక్షించారు. గత 24 గంటల్లో 11,525 శాంపిల్స్ పరీక్షిస్తే 1550 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో 12,178 యాక్టివ్ కేసులున్నాయి. 

also read:వరుస ఘటనలు: నిజామాబాద్ ఆసుపత్రి సూపరింటెండ్ నాగేశ్వరరావు రాజీనామా

కరోనా సోకి 23,679 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో మాత్రం 1,197 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లో తొమ్మిది మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 365 మంది మరణించారు.

జీహెచ్ఎంసీలో 926, రంగారెడ్డిలో212,మేడ్చల్లో 53,సంగారెడ్డిలో,19, ఖమ్మంలో38, కామారెడ్డిలో 33, వరంగల్ అర్బన్ 16,వరంగల్ రూరల్ లో 8, నిర్మల్ లో 1, కరీంనగర్ లో 86, యాదాద్రిలో 05, మహబూబాబాద్ లో 13, పెద్దపల్లి, మెదక్ లలో ఆరేసి చొప్పున కేసులు నమోదయ్యాయి.

మహబూబ్ నగర్ లో 13, మంచిర్యాలలో1, భద్రాద్రి కొత్తగూడెంలో 10, జయశంకర్ భూపాలపల్లిలో 6,నల్గొండలో 41, రాజన్న సిరిసిల్లలో7, ఆదిలాబాద్ లో 1, వికారాబాద్ లో 3, నాగర్ కర్నూల్ లో2, వనపర్తిలో1,గద్వాలలో 5, సిద్దిపేట, సూర్యాపేటలో 10 చొప్పున కేసులు రికార్డయ్యాయి.
 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 13, Jul 2020, 10:01 PM