తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 2099కి చేరుకొన్నాయి..బుధవారం నాడు రాష్ట్రంలో 109 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇవాళ ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 63కి చేరుకొంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 2099కి చేరుకొన్నాయి..బుధవారం నాడు రాష్ట్రంలో 109 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇవాళ ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 63కి చేరుకొంది.
also read:మాల్స్ మినహా అన్ని షాపులు తెరిచేందుకు కేసీఆర్ అనుమతి
undefined
ఇవాళ రాష్ట్రంలో 107 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 39 కేసులు నమోదైతే, వలస కార్మికులు, విదేశాల నుండి వచ్చిన వారితో 68 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. సౌదీ అరేబియా నుండి వచ్చిన 49 మందికి కరోనా సోకిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 76 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల 12, రంగారెడ్డిలో 6, సిరిసిల్ల, మేడ్చల్, మంచిర్యాలలో మూడేసి కేసులు నమోదయ్యాయి. మహబూబ్ నగర్ , ఖమ్మం, నాగర్ కర్నూల్, వికారాబాద్, సిద్దిపేట లలో ఒక్కో కేసు నమోదైనట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో కరోనా నిరోధించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు.