మాల్స్ మినహా అన్ని షాపులు తెరిచేందుకు కేసీఆర్ అనుమతి

By narsimha lodeFirst Published May 27, 2020, 10:22 PM IST
Highlights

 హైద్రాబాద్ నగరంలో  గురువారం నుంచి  మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో సరి, బేసి పద్దతిలో దుకాణాలను తెరుస్తున్నారు. 

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో  గురువారం నుంచి  మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో సరి, బేసి పద్దతిలో దుకాణాలను తెరుస్తున్నారు. 

also read:లాక్‌డౌన్ దెబ్బ: రూ. 12 వేల కోట్లకు వచ్చింది రూ. 3100 కోట్లేనన్న కేసీఆర్

దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది పోగయ్యే విధానం అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. షాపుల యజమానులు, వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరింది. అన్ని ట్యాక్సీలు, ఆటోలకు కూడ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. లాక్ డౌన్ వల్ల రాష్ట్రం భారీగా ఆదాయం కోల్పోయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. మరో వైపు హైద్రాబాద్ పట్టణంలో సిటీ బస్సుల రాకపోకలపై నిషేధం కొనసాగనుంది. సిటీ బస్సుల నడపడంపై త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
 

click me!