
Telangana IAS Officers: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన కొంత సమయానికే ఐఏఎస్ లకు ప్రమోషన్ ఇస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2015 బ్యాచ్‌కు చెందిన 14 మంది ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి పదోన్నతి 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అదే సమయంలో కొందరు అదే పదవిలో కొనసాగనుండగా.. మరికొందరు ఐఏఎస్ లు కొత్త పోస్టులలో విధులు నిర్వహించనున్నారు.
పదోన్నతి పొందిన వారు వీరే..
పమేలా సత్పతి, అనురాగ్ జయంతి, గౌతమ్ పాత్రు, రాహుల్ రాజ్, భావేష్ మిశ్రా, సత్య శారదాదేవి, నారాయణ రెడ్డి, ఎస్. హరీష్, జి. రవి, కె. నిఖిల, అయేషా మష్రత్ ఖానమ్, సంగీత సత్యనారాయణ, యాసీన్ బాషా, వెంకట్రావ్ ఉన్నారు.