మ‌రో రెండు రోజులు మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ

Published : Apr 06, 2023, 09:46 AM IST
మ‌రో రెండు రోజులు మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ

సారాంశం

Hyderabad: మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రాంతీయ కార్యాల‌యం అంచ‌నా వేసింది. ఇదే క్ర‌మంలో  సాయంత్రం లేదా రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.  

Weather Update: తెలంగాణ‌లో మ‌రో రెండు రోజుల పాటు సాధార‌ణం నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచ‌నా వేసింది. వివిధ జిల్లాల‌తో పాటు హైద‌రాబాద్ న‌గ‌రంలోనూ వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని తెపింది. ఇదే క్ర‌మంలో  సాయంత్రం లేదా రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వివ‌రాల్లోకెళ్తే.. హైద‌రాబాద్ నగరం బుధవారం ఉదయం ఉక్కపోతతో మేల్కొంది, కానీ మ‌ధ్యాహ్నం స‌మ‌యం నుంచి వాతావ‌ర‌ణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మేఘాలు క‌మ్ముకుని చ‌ల్ల‌ని, ఆహ్లాదకరమైన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. క్రమంగా ఆకాశం మేఘావృతమై, బుధ‌వారం సాయంత్రం హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురవడంతో ఎండ‌ల, ఉక్క‌పోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. అలాగే, గురువారం సాయంత్రం లేదా రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ (ఐఎండీ-హెచ్) శుక్రవారం వరకు నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంద‌ని పేర్కొంది.

పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు తెలంగాణ‌లోని వివిధ జిల్లాల్లో కూడా వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 9 నుంచి వాతావరణం వేడెక్కే అవకాశం ఉందని ఐఎండీ-హెచ్ అంచనా వేసింది. 

ఏపీలోనూ ప‌లు కోట్ల వ‌ర్షాలు.. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ ప‌లు చోట్ల సాధార‌ణం నుంచి మోస్తారు వ‌ర్షాలు న‌మోద‌వుతాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది. ప‌లు ప్రాంతాల్లో మురుములు, మెరుపుల‌తో తేలిక‌పాటి వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. అలాగే, బ‌ల‌మైన‌ ఈదురు గాలులు కూడా వీస్తాయ‌ని వెల్ల‌డించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్