హైద్రాబాద్‌కి చేరుకొన్న కరోనా వ్యాక్సిన్: 1213 సెంటర్లలో వ్యాక్సినేషన్

By narsimha lode  |  First Published Jan 12, 2021, 12:56 PM IST

కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ హైద్రాబాద్ కు చేరుకొంది. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుండి  ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొంది.


హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ హైద్రాబాద్ కు చేరుకొంది. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుండి  ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొంది.

తెలంగాణలో తొలి విడత కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తొలి విడతలో సుమారు 5 లక్షల  డోసులు తెలంగాణకు రానుంది. ఈ క్రమంలోనే మంగళవారం నాడు 3.72 లక్షల డోసులు హైద్రాబాద్ కు చేరుకొంది. 

Latest Videos

undefined

తెలంగాణ రాష్ట్రంలోని 866 కోల్డ్ స్టోరేజీ పాయింట్ల ద్వారా ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వ్యాక్సిన్ పంపనున్నారు.  శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి కోఠిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయానికి టీకాను చేర్చారు. రాష్ట్రంలోని 1213 వ్యాక్సిన్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. 

మరికొన్ని డోసుల వ్యాక్సిన్ త్వరలోనే సీరం ఇనిస్టిట్యూట్ నుండి  తెలంగాణకు వ్యాక్సిన్ రానుంది. వ్యాక్సిన్ ప్రక్రియ ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ సన్నాహక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన డ్రైరన్ విజయవంతమైంది. 
 

click me!