మాట నిలుపుకొన్నాం: ఉచిత మంచినీటి స్కీమ్ ప్రారంభించిన కేటీఆర్

Published : Jan 12, 2021, 11:54 AM IST
మాట నిలుపుకొన్నాం: ఉచిత మంచినీటి స్కీమ్ ప్రారంభించిన కేటీఆర్

సారాంశం

రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ ప్రజలకు పంచుతున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారుమంగళవారం నాడు హైద్రాబాద్‌లోని రహమత్‌నగర్ లో ఉచిత మంచినీటి పథకానికి మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.

హైదరాబాద్: రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ ప్రజలకు పంచుతున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారుమంగళవారం నాడు హైద్రాబాద్‌లోని రహమత్‌నగర్ లో ఉచిత మంచినీటి పథకానికి మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.

హైద్రాబాద్‌లో ఉన్న పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.  కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా కూడా లేవని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఉచిత మంచినీటి పదకం అద్భుతమైన స్కీమ్ గా ఆయన పేర్కొన్నారు. ఉచిత మంచినీటి పథకంతో ప్రభుత్వంపై రూ. 500 కోట్ల భారం పడుతోందన్నారు. 

also read:జీహెచ్ఎంసీలో నేటి నుండి ఉచిత మంచినీటి పథకం: నల్లాలకు మీటర్లు

జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలుపుకొన్నామని ఆయన చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తమ ప్రభుత్వం పథకాలను అందిస్తుందని ఆయన గుర్తు చేశారు. కొన్ని పార్టీలు ఎన్నికల ముందు హామీలిచ్చి గాలికి వదిలేస్తాయన్నారు. కానీ తాము పేదలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.

కేసీఆర్‌కు, ఇతర పార్టీలకు కూడా ఇదే తేడా అని ఆయన చెప్పారు. కరోనా కష్టకాలంలో తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక్క పైసా పన్నులు చేయలేదని చెప్పారు. ఉన్న పన్నులను తగ్గించామన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?