కరోనా ఎఫెక్ట్.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగం వేతనం రూ.7: దిక్కుతోచని స్థితిలో కార్మికులు

By Siva KodatiFirst Published Jul 12, 2020, 4:55 PM IST
Highlights

కరోనా కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. ఇది ఏ ఒక్క దేశానికో.. రాష్ట్రానికో పరిమితం కాలేదు. ఈ క్రమంలో ఈ రంగాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

కరోనా కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. ఇది ఏ ఒక్క దేశానికో.. రాష్ట్రానికో పరిమితం కాలేదు. ఈ క్రమంలో ఈ రంగాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాగా గత మూడు నెలలుగా సగం వేతనాలు అందుకుంటున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు జూన్‌లో పూర్తి జీతం అందుతుందని ఆశపడ్డారు. కానీ ఆ ఆశ ఎంతో సేపు నిలవలేదు. ఈ నెల పేస్లిప్‌లు చూసుకుని వారు కంగుతిన్నారు.

తమకు రూ.7 మాత్రమే వచ్చాయని కొందరు చెప్పగా.. చాలా మంది రూ.5 వేలకు మించి జీతాలు రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. పరిస్ధితి ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం చేస్తామని ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

టీఎస్ఆర్టీసీలో 49 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు‌గా విధులు నిర్వహిస్తున్నారు. బస్సులు పూర్తి స్థాయిలో నడవకపోవడం వల్ల ఉద్యోగులందరినీ విధుల్లోకి తీసుకోవడం లేదు.

కేవలం పనిచేసిన రోజులకే వేతనం చెల్లిస్తున్నారు. ఫలితంగా రూ.100 కంటే తక్కువ నుంచి రూ. వెయ్యి లోపు జీతం వచ్చిన ఉద్యోగులు కూడా ఉన్నారు. చాలా మందికి రూ. 4 వేల నుంచి రూ.5 వేల జీతం వచ్చింది. ఈ జీతాలపై ఎంప్లాయిస్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. వీటితో ఉద్యోగులు ఎలా బతుకుతారని ప్రశ్నించింది. 
 

click me!