కేసిఆర్ లక్కీ నెంబర్: తెలంగాణ ఎన్నికలకు ముహూర్తం అదే..

By pratap reddyFirst Published Sep 24, 2018, 8:55 AM IST
Highlights

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు లక్కీ నెంబర్ కలిసి వచ్చేలా ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఎన్నికల కమీషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు లక్కీ నెంబర్ కలిసి వచ్చేలా ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

నవంబర్ 21, 26 తేదీల మధ్య తెలంగాణ శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని ఈసి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 24వ తేదీన ఎన్నికలు జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు. ఆ సంఖ్య కేసిఆర్ లక్కీ నెంబర్, ఆరు కేసిఆర్ లక్కీ నెంబర్. 24లోని 2,4 కూడితే ఆరు సంఖ్య వస్తుంది. 

ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాజకీయ పార్టీలు ఈసికి ఫిర్యాదు చేస్తున్నాయి. ఓటర్ల జాబితాపై రెగ్యులేటరీ ఆడిట్ నిర్వహించడానికి ఈసీ ఆడిట్ బృందాలు పంపించే అవకాశం ఉంది. 

అక్టోబర్ 8వ తేదీ తర్వాత ఓటర్ల తుది జాబితాను విడుదల చేసి ఆడిట్ బృందాలు తమ పనిని ప్రారంభిస్తాయి. ఎన్నికలు నవంబర్ 24వ తేదీన జరుగుతాయని, అందుకు అనుగుణంగా ప్రచార కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం తన అభ్యర్థులకు సూచించింది 

click me!